మాదుల్ తీవ్రములై వెలుంగనగు జీవాకారమై తోఁచె లం
కా దుర్గాంతర పట్టణంబు పెనుఁజీకట్లందు సౌధస్థలీ
ప్రాదుర్భూత విచిత్రమైన దీపికలచే రాజిల్లు ఛాయాళిచే.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము నందలి యీ పద్యంలో లంకా ప్రథమ ద్వార ప్రవేశం చేసిన హనుమంతునికి దుర్గం లోపల నున్న పట్టణం కనిపించిన తీరుని విశ్వనాథ వర్ణించారు.
శరీరాన్ని బాగా కుదించుకొని, హనుమతుడు పిల్లిలాగా చిత్రంగా ప్రాకారాన్ని దాటి, గాలికి రెమ్మ వాలినట్లుగా వాలి, సౌధాగ్రం మీద నిల్చున్నాడు. ఏడంతస్తుల మేడపై నిల్చొని అటూఇటు చూసిన హనుమకు, దీపతోరణాలతో వెలిగిపోతూ, ఊరిలో నాలుగు వాడల్లో వరుసగా ఉన్నటువంటి భవనాలు హారంలోని ముత్యాలు లాగా కనిపించాయి.
మహాకవి ఆ దృశ్యాన్ని ఈ విధంగా వణించారు.
" ఆ రాత్రివేళ కమ్మిన పెనుచీకట్లలో, లంకాదుర్గం లోపలి పట్టణం, ప్రాసాదాల లోపలి చిత్ర విచిత్రమైన దీపాలతో పడుతున్న నీడలతో వెల్గొందుతూ ఉంది. అయితే, ఆ దృశ్యం, ఎట్లా ఉన్నదంటే, ఆత్మ విచారణ చేసి, స్వస్వరూప జ్ఞానాన్ని పొందవలసిన శ్రమ లేకుండా, కామం, క్రోధం, లోభం మొదలైన అరిష్డ్వర్గాలు ప్రబలినటువంటి జీవుని ఆకారం లాగా తోస్తున్నది. "
హనుమ ముక్తేంద్రియభ్రాంతుడు. ఇంద్రియముల యొక్క ఆకర్షణ నుండి విముక్తుడైన వాడు. జితేంద్రియుడు.. అటువంటి వానికి, కామాతురుడైన రావణుని పట్టణం, దీపాల పై పై మెరుపులతో, అరిషడ్వర్గాలకు లోనైన ఆత్మజ్ఞానశూన్యుని శరీరం లాగా కనపడింది.
No comments:
Post a Comment