ట్లో నిల్పన్ బ్రయతింతు దేహ మటు కాదో చచ్చెదన్ లెమ్ము పో
కానీ యీ ఋణమెట్లు తీర్చెదనొ యీ కాసంతకై వచ్చి జ
న్మానేకంబులు దుఃఖినై తిరిగి పొందన్ జాల విశ్వేశ్వరా!
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఏభై అయిదో పద్యం.
" విశ్వేశ్వరా ! నాకు ఈ సంసారబాధలు, ఈతిబాధలు తొలగిస్తే, నేనీ రోజునే ఏ అడవులకో పోయి, ఆకులో అలములో తింటూ దేహాన్ని నిలుపుకోవటానికి ప్రయత్నిస్తాను. అవీ దొరక్కపోతే చస్తాను, నీ కెందుకు. నా భార్య, పిల్లలకు ఏదో ఒక దారి చూపించమన్నాను కదా ! దానితో, నీకు ఋణగ్రస్తుడ నవుతున్నాను. కానీ పుట్టటం వల్ల సంభవించిన యీ ఋణాన్ని ఎట్లా తీరుస్తాను తండ్రీ ! అల్పమైన యీ భౌతిక సుఖాల కోసం, అనేక జన్మలెత్తుతూ, దుఃఖాన్ని అనుభవిస్తూ, ఈ జననమరణ చక్రంలో పడి తిరుగలేను. "
శివుడు భవబంధ విమోచన చేసేవాడు. భవము అంటే పుట్టుక. పుట్టుక వల్ల ఎన్నో బంధాలు ఏర్పడతాయి. జీవుడు సంసారమనే కట్టుకొయ్యకు కట్టివేయబడతాడు. కట్టుకొయ్య నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ, దాని చుట్టూనే తిరుగుతుంటాడు. ఆ కట్టుకొయ్య నుంచి విడుదల కావాలంటే, పశుపతి శరణు పొందాలి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం కావాలి. అందుచేతనే, కవి పునర్జన్మరహిత మోక్షసిద్ధిని కోరుతున్నాడు. అది జరగాలంటే, అన్నివిధాలా, అందరితోనూ, ఋణవిముక్తి జరగాలి. చివరకు పరమేశ్వరునికి కూడా అప్పు పడకూడదు. కర్మఫలాలను అనుభవించాలి, మెలమెల్లగా అప్పు తీర్చుకోవాలి. నిస్వార్థంగా భగవత్సేవకు అంకిత మవ్వాలి.
No comments:
Post a Comment