స్కరణం బించుకలేమి మైజడలు మూఁగన్ బొట్ట పెల్లాఁకటన్
సురుగన్ ముమ్మొనకఱ్ఱతోఁ దడుముకొంచున్ లచ్చి గేహంబుముం
దర నిల్చున్ భవదీయ భిక్షుకత కంతం బెప్డు విశ్వేశ్వరా !
' మా స్వామి ' లో తొమ్మిదవ పద్యమిది.
" విశ్వేశ్వరా ! ఏనుగు తోలుతో చేసిన అంగవస్త్రంతో, మానవకపాలం భిక్షాపాత్రను చేతిలో పట్టుకొని, ఆలనాపాలనా లేని వంటిపై జడలు వ్రేలాడుతుండగా, పొట్ట ఆకలితో లోపలికి పోగా, మూడు మొనలున్న కర్రతో తడుముకొంటూ, లక్ష్మీదేవి ఇంటిముందర నిల్చొనే నీ భిక్షాటనకు ముగింపు యెప్పుడు తండ్రీ ! "
ముమ్మొనకర్ర త్రిశూలం.
అష్టైశ్వర్యాలు ప్రసాదించే శివుడు, లక్ష్మీదేవి ఇంటి ముందర భిక్షాటనం చేయటం అనేది కేవలం ఒక లీల. శ్రీనాథుడు తన కాశీఖండ కావ్యంలో ఈ ఘట్టాన్ని అద్భుతంగా వర్ణించారు.
No comments:
Post a Comment