మ్యగ్వ్యాఖ్యానము జేసెఁబో, అఘములేలా నిల్చునయ్యా ! సుధా
రుగ్వ్యాబద్ధకిరీట ! దైవతజగద్రు శ్రీప్రసూన ప్రభా
స్రగ్వ్యుత్పత్తులు నీ జటాలతలు, రక్షాదక్ష విశ్వేశ్వరా,
ఇది ' మాస్వామి (విశ్వేశ్వర శతకం) లోని పద్దెనిమిదవ పద్యం.
భక్తిని ప్రబోధించే శతకాలలో భగవంతుని యొక్క సగుణ, నిర్గుణ తత్త్వాలను విశేషంగా స్తుతించటం ప్రసిద్ధమైన విషయం. అదే రీతిలో విశ్వనాథ విశ్వేశ్వరుణ్ణి స్తుతించారు.
" ఓ విశ్వేశ్వరా ! నీవు అన్ని దిక్కులలోను, ఆకాశంలోను, అంతటా నిండినవాడవు. సర్వాంతర్యామివి. ఎవరైతే భక్తిభావంతో, నీ సగుణరూపాన్ని చక్కగా వ్యాఖ్యానం చేస్తారో, వారి పాపాలెందుకు నిలుస్తాయి? అవి పటాపంచలైపోతాయి. నీవు అమృతాంశుడైన చంద్రుణ్ణి శిరోభూషణంగా దాల్చినవాడివి. అందువల్ల, పరిపూర్ణ భక్తిభావంతో కొలిచేవారిపై అమృతవర్షం కురిపిస్తావు. నీవు కల్పవృక్షం వంటి వాడివి. కాంతులు విరజిమ్ముతూ, పరిమళాలు వెదజల్లే పారిజాతకుసుమ మాలలు నీ జడలనే తీగలు. అందువల్ల, భక్తులను రక్షించటానికి నీకంటె సమర్థు డెవడు?
పద్యంలో విశ్వనాథవారు వాడిన విశేషణాలను ధ్యానం చేస్తే హృదయం భక్తిభావంతో నిండిపోతుంది. సనాతన ధర్మం లోని గొప్పతన మిదే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సౌధాగ్రానికి చేరినట్లు, సగుణారాధనను నిర్మలమైన మనస్సుతో చేస్తే, నిశ్చలతత్త్వం బోధపడుతుంది. అద్వైతసిద్ధి కలుగుతుంది.
No comments:
Post a Comment