న్నుతులై సప్తజనాఖ్యులైన మునులిందున్ వారు మున్నాశ్రమ
స్థితియై యుండిరధశ్శిరుల్ పరిణతశ్రీకుల్ తపోభాగసం
గత నానామహిముల్ తపోవన కృతాకాంక్షామహశ్శ్లాఘ్యులై.
వారు త్యజించిపోయినను వారి తపోవన దేశ మీదృశో
దార విచిత్రభోగ మహితంబయి యొప్పుచునుండు నిద్ది యె
వ్వారికి నప్రవేశ్య మొకవంకను జొచ్చిన వేఁడు సాహస
ప్రారభమాణుఁడై తిరిగివచ్చుట యన్నది లేదు రాఘవా!
వాలిసుగ్రీవులు కవలలు. వారిద్దరూ తలపడి మల్లయుద్ధం చేస్తున్నప్పుడు, వాలిని గుర్తుపట్టడం కష్టమై, రాముడు వాలిపై శరసంధానం చేయలేదు. వాలి చెతిలో దెబ్బలుతిని అలసిపోయిన సుగ్రీవుని దైన్యస్థితిని చూసి, రాముడు సుగ్రీవుని కంఠంలో గుర్తు కోసం గజపుష్పమాలను వేయమన్నాడు. రాముని ఆదేశం మేరకు లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి గజపుష్పమాలతో అలంకరించాడు.
ఆ తరువాత, మెల్లగా నడిచి వెళ్తున్న రామునికి ఒక అందమైన వనం కనిపించింది. ఆ తోటను చూడగానే, రాముని మనస్సుకు యెంతో హాయిగా అనిపించింది. అందుచేత, ఆ వనం యొక్క విశేషాలను చెప్పమని రాముడు సుగ్రీవుడిని అడిగాడు. ఆ విశేషాలను చెప్పేవే యీ రెండు పద్యాలు.
" ఈ వనంలో తపస్సు చేసుకొంటున్న ఏడుగురు మునీశ్వరులు స్వర్గానికి వెళ్ళి దాదాపు నూరు సంవత్సరాలైంది. వారిక్కడ తలక్రిందులుగ తపస్సు చేసేవారు. తపోగ్నిలో క్రాగిన వారు యెన్నో మహిమలు సంపాదించినవారు. చాలా పొగడదగినవారు.
వారీ వనాన్ని విడిచిపెట్టి పోయినా కూడా, ఈ తపోవనం కన్నులపండువుగా, విచిత్రభోగానుభవాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ వనంలో ప్రవేశించడాని కెవరికీ సాధ్యపడదు. ఒకవేళ సాహసించి ఎవరైనా ప్రవేశించినా,ఇందులో నుండి తిరిగివెళ్ళటం అనేది జరిగేపని కాదు. "
మహర్షుల తపోమహిమను తెలియజేసే ఈ రెండు పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనివి.
No comments:
Post a Comment