తే సర్వంబయి నీకు నా యమ సొబంగే నచ్చి కన్నారు ర
య్యా ! సంతానము, నేన్గుమోమొకడు, వింతౌ నార్మొగాలొక్కడో
హో ! సౌరాపద కాకరుం డొకఁ డదేమో కానీ విశ్వేశ్వరా !
' మా స్వామి ' లో పదవ పద్యమిది.
" ఓ స్వామీ ! ఆ కొండదొర కూతురుకు నీ ఒయ్యారం, వంటికి పూసుకొన్న బూడిదపూతే తన సర్వసమూ అయి, ఇక నీకు కూడా ఆమె సొగసే నచ్చి, బలే సంతానాన్ని కన్నారుగదయ్యా ! ఒకడేమో గజముఖుడు, వింతగొలిపే ఆరు మొగాల వాడొకడు, దేవతల బాధలు తీర్చేవాడొకడు. ఆహా ! అదేమిటో గాని వింత సంసారం విశ్వేశ్వరా ! "
పెద్ద కొడుకు ఏనుగుమోము వాడు వినాయకుడు విఘ్నాధిపతి. చిన్నవాడు కుమారస్వామి ఆరు ముఖాలున్నవాడు. దేవతల సైన్యాధిపతి. తారకాసురుణ్ణి సంహరించి, దేవతల బాధలను పోగొట్టినవాడు.
తమిళదేశస్థులకు వినాయకుడు, కుమారస్వామి ఆరాధ్యదైవాలు. చాలామంది, వారి పిల్లలకు ఆర్మొగం అని పేరు పెట్టుకుంటారు.
ఈ పద్యం కూడా శివుని సగుణరూపాన్ని వర్ణించేది.
No comments:
Post a Comment