నీ తోడన్ ముడివెట్టుకొంటిని, భవానీభర్గులే నాకుఁ ద
ల్లీ తండ్రంచును నమ్మితిన్ గరుణ పాలింపంగదే నాకు నే
లా తీవ్రాపద? యప్రతిష్ఠ పడనేలా మీకు? విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని నలభై యెనిమిదో పద్యం.
" విశ్వేశ్వరా ! నా విషయంలో నీకు యీ మౌనవ్రతం యెందుకు? నువ్వు మా కులదైవమని నా జీవితాన్ని నీతో ముడిపెట్టుకున్నాను. పార్వతీపరమేశ్వరులే నా తల్లిదండ్రులని నమ్మాను. అందుచేత, నా మీద దయ చూపించరాదా? తండ్రీ ! నాకు యీ కష్టా లెందుకు? నా మీద దయ చూపించలేదని నీకు యీ చెడ్డ పేరెందుకు? "
ఆత్మాశ్రయ కవిత్వంలో భగవంతునితో సన్నిహితత్వం యెక్కువగా ఉంటుంది.
No comments:
Post a Comment