నెన్నన్ గాస్తకుకూస్త కిప్పటికి నీవే దక్క దిక్కొండు లే
దన్నా ! మొన్నటిదాక మౌనమది గర్వాధీనతన్ గాదు నీ
కన్నన్ వేఱొకయండ యున్నదనియున్ గాదయ్య విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ముప్పదియైదవ పద్యం.
మా స్వామీ. ! విశ్వేశ్వరా ! మా తండ్రి నిన్ను చూపించి వెళ్ళారు కానీ, నిన్ను పీడించాలని నే ననుకోవటం లేదు. ఎందుకంటే, ఇప్పటికైతే కాస్తోకూస్తో నువ్వే తప్ప వేరొక దిక్కు లేదు. ఈ మధ్య ఏం మాట్లాడకుండా ఉన్నానంటే, అది గర్వంతో చేసిన పని కానీ, ఏదో వేరే అండ ఉన్నదని కానీ మాత్రం కాదయ్యా ! "
విశ్వనాథ తండ్రి పేరు శోభనాద్రిగారు. ఆయన మహాదాత. ఆయన ఎంత దాత అంటే, చలికి శరీరం కొంకరలు పోతున్న ఒక బీదవాడు, పైన కప్పుకోవటానికి ఒక్క బట్టయినా లేదంటే, తాను ధరించిన ధోవతిని అతడికిచ్చి, పై నున్న అంగవస్రాన్ని కట్టుకొని ఇంటికి వచ్చినవాడు. అందుకనే ఆయనను విశ్వనాథ, దధీచి, శిబి, కర్ణుడు మొదలైన మహాదాతలతో పోల్చారు.
విశ్వనాథకు, వారి స్వగ్రామంలోని వేణుగోపాలస్వామికి, కాశీ విశ్వేశ్వరునికి భేదమే లేదు. అందుకనే, ఆత్మాశ్రయకవిత్వ ధోరణిలో విశ్వేశ్వరునితో అంత చనువుగా విన్నవించుకున్నారు.
No comments:
Post a Comment