య్యాలంకార రసధ్వనుల్ తెలిసి కావ్యమ్ముల్ క్వచిత్కంబుఁగా
నాలోకించి తనంతపండితుఁడు లేఁడంచున్ విడంబించుఁ దం
డ్రీ ! లీలామయమూర్తి ! నిన్నెఱుఁగ లేనేలేఁడు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ముప్పది రెండవ పద్యం.
"విశ్వేశ్వరా ! కొన్ని పదాలకు ఎలాగో ఒకలాగున అర్థాలు నేర్చుకొని, శయ్య, అలంకారము, రససిద్ధాతం తెలుసుకొని, ఏవో కొన్ని కావ్యాలను చదివి, తనను మించిన పండితుడు లేనే లేడంటూ ప్రగల్భాలు పలికినంత మాత్రాన అతడు నిన్ను తెలుసుకొనలేడు. నీవు జీవులను ఆడించేవాడివి. సర్వజ్ఞుడివి."
శయ్య అనేది కావ్యాలకు సంబంధించిన ' పద గుంఫనం ', పదాల కూర్పు. సత్కావ్యంలో ఉపమాద్యలంకారా లుండాలి. శృంగారాది రసపోషణ జరగాలి. కానీ, అవి మాత్రమే, కావ్యానికి పరిపుష్టి కలిగించలేవు. సత్కావ్యం మహార్థాలను స్ఫురింపజేయాలి. కవికి కథాకథన శిల్ప చాతుర్యముండాలి . అనేక శాస్త్ర రహస్యాలు ఆకళింపు చేసుకోవాలి. అద్భుతమైన కల్పనలను చేయగలగాలి. వివిధ ఛందోరీతులను పాటించాలి. ఇంకా యెన్నో కావ్య లక్షణాలుంటేనే కానీ, అది సత్కావ్య మనిపించుకోదు.
శాస్త్రపరిజ్ఞానం, పాండిత్యం ద్వారా భగవంతుడిని తెలుసుకొనటం అసాధ్యం. నిర్మలమైన, నిశ్చలమైన భక్తి ద్వారా భగవత్తత్వం తెలుసుకొనటం సాధ్యపడుతుంది. మహాకవిత్వ సృష్టి జరగాలంటే, కవికి గాఢమైన ప్రతిభ ఉండాలి. శ్రీమద్రామాయణ కల్పవృక్షము వంటి బృహత్కావ్య సృష్టి జరగాలంటే, విశ్వనాథ చేసినటువంటి కవితారూప తపస్సు చేయాలి.
No comments:
Post a Comment