డే మాటల్, సిరు లిచ్చి వ్యర్థజనులందే సేవ చేయించ కె
ట్లో మాన్పింపుము, కాదయేని మృదుపాండుశ్రీనవచ్ఛాయలో
నీ మైదీధితి లోనఁ జేర్చుకొను తండ్రీ ! నన్ను విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ఏభైరెండో పద్యం.
" విశ్వేశ్వరా ! ఇన్ని మాట లెందుకు స్వామీ ! నిన్ను ప్రార్థిస్తున్నాను. రెండే రెండు మాటలు. నా దరిద్రం తొలగిపోయేటట్లుగా సంపద లిచ్చి, పనికిమాలినవారి సేవచేయటం మాన్పించనన్నా మాన్పించు లేకపోతే మెత్తనైన, తెల్లనైన, నూతనమైన నీ దేహకాంతిలో కలిపివేసుకోనన్నా కలిపివేసుకో తండ్రీ ! "
పొట్టకూటి కోసం ఉద్యోగాలు చేస్తూ, స్వార్థపరులైన, అవినీతిపరులైన అధికారుల, పాలకుల దుశ్చర్యలు, ఆగడాలు చూడలేక, అలాగని ఆత్మాభిమానం చంపుకోలేని, ఏ కొద్దిమందో నోరెత్తలేని అస్వతంత్ర వర్తమానసమాజ జీవుల పరిస్థితికి యీ పద్యం అద్దం పడుతుంది.
No comments:
Post a Comment