పలి దెస నెవ్వరో ప్రణయబంధువు కోసము చూచుచున్నటుల్
కలువల సంగడీని వెలికాంతుల బింబముతోఁచె నచ్చటన్
వలసకుఁ బోయి తాఁదిరిగివచ్చిన జుట్టమువోలెఁ జూచుచున్.
హనుమ లంకాపట్టణ దుర్గంలో ప్రవేశించాడు. నిజదేహంతో సంచరిస్తే, కాపలా కాస్తున్న రాక్షస భటులకు తెలిసిపోతుందని, గుప్తదేహంతో వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత సీతాన్వేషణ చేద్దామనుకొంటే, కటికచీకటిలో ఏమీ కనపడదని ఆ ప్రతిపాదనను విరమించుకొని, చంద్రోదయమైన తరువాత వెతకటం ప్రారంభించాలని అనుకొన్నాడు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షములో చంద్రోదయ వర్ణనను విశ్వనాథ పలుతావుల్లో పలురీతుల్లో చేశారు. హనుమ లంకాపట్టణ దుర్గ ప్రవేశం చేసిన సమయంలో జరిగిన చంద్రోదయాన్ని విశ్వనాథ ఈ విధంగా వర్ణించారు.
" తూర్పు దిక్కు అనే పడుచుపిల్ల దుర్గం గోడ పైకి ప్రాకి తన ప్రియుడి కోసం చూస్తున్నట్లు, కలువల చెలికాడైన చంద్రుడు తన తెల్లని కాంతిబింబంతో, పొరుగూరు వెళ్ళి మరల తిరిగి వచ్చిన చుట్టం లాగా కనిపించాడు. "
ఈ చంద్రోదయ వర్ణనం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, సంశయ ఖండములో ఉంది.
No comments:
Post a Comment