నస్రగ్మాలలు శ్వేతహస్తికటదానంబుల్ త్వదభ్యర్చనా
ఘస్రారంభములందు స్నానకుసుమౌఘ శ్రీసుగందార్థమై
త్రిస్రోతఃపతి ! నేను నాకపతినా తెప్పింప? విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ముప్ఫయ్యొకటవ పద్యం.
" విశ్వేశ్వరా ! ఆకాశగంగాజలం, దిగ్గజం తొండముతో నింపిన నీరు, పారిజాత కుసుమాలతో అల్లిన మాలలు, ఐరావతం గండస్థలం నుండి స్రవించే మదజలం మొదలైన సుగంధాలు విరజిమ్మే ద్రవ్యాలు, నీ అర్చన ప్రారంభించటానికి ముందు స్నానార్థమై తెప్పించటానికి, నేనేమన్నా స్వర్గాధిపతి ఇంద్రుడినా? "
ఆకాశగంగకు మందాకిని అని పేరు. నాలుగు దిక్కులను నాలుగు మదగజాలు మోస్తుంటాయి. స్వర్గలోకపు దేవతావృక్షం పారిజాతం. తూర్పు దిక్కును మోసే తెల్లని ఏనుగు పేరు ఐరావతం. దీనిని ఇంద్రుడు వాహనంగా చేసుకొన్నాడు. గంగానదికి త్రిపథగ అని, ముయ్యేరని, త్రిస్రోతస్సు అని పేర్లు ఉన్నాయి. త్రిస్రోతఃపతి అంటే శివుడు.
No comments:
Post a Comment