లాకృత్యంబుగ నంగలార్చిన దినాలన్ నాదు జిహ్వాగ్ర వా
ణీకింక్లింకిణి నూపురస్వనము లెంతే దట్టమై పోయె నే
డీ కారుణ్యము చూచి నా కసలు నోరే రాదు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై ఎనిమిదో పద్యం.
" విశ్వేశ్వరా ! నీ ఎడబాటు సహించలేక, పిల్లచేష్టగా, నీ కరుణ కోసం వీణ వాయిస్తూ అంగలార్చిన రోజుల్లో, నా నాలుక చివర సరస్వతీదేవి మధుర, మంజుల మంజీరనాదాలు యెంతో విరివిగా వినిపించేవి. ఇప్పుడు నీ కరుణ చవి చూసిన తరువాత, నా నోరు పెగలటం లేదు తండ్రీ ! "
విశ్వనాథ యువకుడిగా ఉన్నప్పుడు గిరికుమారుని ప్రేమగీతాలు, భ్రష్టయోగి మొదలైన ఉద్వేగభరితమైన భావకవిత్వ ఛాయలు కలిగిన రచనలు చేశారు. ఇప్పుడు పరిపక్వమైన జ్ఞానసమృద్ధ జీవితంలో, అటువంటి కవిత్వం రావటం లేదని, విశ్వనాథవారు అంటున్నట్లుగా అర్థం చేసుకొనవచ్చు. యదార్థంగా, పరిపక్వదశలో, శ్రీమద్రామాయణ కల్పవృక్షం వంటి బృహత్కావ్యం పూర్తికావటం విశేషం.
No comments:
Post a Comment