Thursday 30 April 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 367 (శ్రీమద్భగవద్గీత: సాంఖ్యయోగం)





కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
యచ్ఛ్రేస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం.

కృపణత్వోపహతస్వభావుడను, నే పృచ్ఛింతునో! కేశవా
యిపుడే ధర్మవిమూఢ చేతసుడ, నర్థింతున్ నినున్ శిష్యుడన్
ద్రపచేతన్ శరణంచు నుంటిని, సుహృద్భావా ! ప్రసన్నుండవై
యుపదేశింపుము నాకు నిత్యమగు శ్రేయోధర్మ మార్గంబునున్.

ఆకలైనవాడికే అన్నం పెట్టాలిఅవసరమైనవాడికే దానం చేయాలిఅడిగినవాడికే చెప్పాలిఅర్జునుడికి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనే ఆకలయింది, అజ్ఞానం పోగొట్టుకొనవలసిన అవసర మొచ్చిందిఅందుకని, ఎవరినైతే అడగాలో వారినే అడిగాడుఅర్జునుడు కర్తవ్యనిర్వహణ సమయానికి ధర్మసమ్మూఢచేతసు డయ్యాడుధర్మం విషయంలో సందేహం కల మనస్సుకలవా డయ్యాడు సందేహం తీరితే ఆకలి తీరినట్లవుతుందిఅప్పటిదాకా నిద్ర కూడా పట్టదుఇది ఉత్తముల విషయంలో నిజంఅర్జునుడు సామాన్యుడు కాడుఅతడు మహాపురుషుడుకానీ ఒక లోపంతో బాధపడుతున్నాడు.

లోకంలో, పలువురు పలు దోషాలతో బాధపడుతుంటారుకొందరికి కోరికలు ఎక్కువగా ఉంటాయివారు కామోపహతులుకొందరికి కోపం ఎక్కువగా ఉంటుంది.   వారు క్రోధోపహతులు.   అర్జునుడు కార్పణ్యదోషోపహతుడు.   అర్జునుడికి కార్పణ్యదోషం ఉందికార్పణ్యమంటే లోభత్వం, దారిద్ర్యం, అజ్ఞానం అనే అర్థాలున్నాయిఅర్జునుడు, చిన్న దోషం కలిగి ఉన్నా, సత్పురుషుడు కనుక, మనం అతడు అజ్ఞానమనే దోషంతో, ఆత్మజ్ఞానశూన్యమనే దోషంతో బాధపడుతున్నాడని అన్వయించుకోవాలిఅజ్ఞానమనేది ఒక చిన్న పొరలాంటిదిపొర తీసేస్తే  అజ్ఞానం తొలగిపోతుంది పొరను తొలగించాలంటే వైద్యుడు కావాలికంట్లో శుక్లం వస్తే మనకు మనమే తొలగించుకోలేము. పనిని కంటివైద్యుడు చేస్తాడు కంటివైద్యుడే పరమాత్మయైన శ్రీకృష్ణుడు

అయితే, కంటివైద్యుడికి ఉన్న సంగతిని చెప్పి, కంటిలోని పొరను తొలగించమని, మరల చూపును ప్రసాదించమని అర్థించాలిఅదే చేశాడు అర్జునుడు.   ఏది తనకు మంచి చేస్తుందో అది చెప్పమని శరణువేడాడుశ్రీకృష్ణుణ్ణి గురువుగా స్వీకరించి, తాను అతడి శిష్యుడి నన్నాడుపరమార్థం ఉపదేశించ మన్నాడు.

శరణాగతిని కోరిన శిష్యుని యెడల గురువు ప్రసన్నుడౌతాడు, మహదానందభరితుడౌతాడు. మన పెద్దలు చెబుతుంటారు " అడగందే చెప్పకూడదని, అడిగిన తరువాత చెప్పకుండా ఉండకూడదని. "

కృపణత్వంచే (అజ్ఞానం) ఉపహతస్వభావుడైన (కొట్టబడిన, వికలమైన, మలినమైన మనస్సు కలవాడైన) ధర్మసమ్మూఢచేతసుడు ( ధర్మ విషయంలో సందేహం కలిగిన మనస్సు కలవాడైన), శిష్యస్తేహం ( నేను నీకు శిష్యుడను), త్వాం ప్రపన్నం (నిన్ను శరణు పొందుతున్నాను) అన్న అర్జునుడికి ఆత్మజ్ఞానం బోధించాకుండా సద్గురువు ఎలా ఉండగలడు విధంగా జగద్గురువు యోగ్యుడైన, జిజ్ఞాసువైన శిష్యునికి తత్వాన్ని ఉపదేశించిన ఫలితంగా శ్రీమద్భగవద్గీత మానవాళికి దక్కింది.

ఇది రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఏడవ శ్లోకం.



సువర్ణ సుమన సుజ్ఞేయము - 366 (శ్రీమద్భగవద్గీత: సాంఖ్యయోగం)


క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప.

శత్రువులందరిన్ గెలవ జాలిన దిట్టవు పార్థ ! యివ్విధిన్ 
క్షత్రియధర్మమున్ వదలి క్లైబ్యుని చందము నొంద నొప్ప దే
మాత్రము; లెమ్ము; నీ హృదయమందున ధైర్యము నొంది యీ కురు
క్షేత్రము నందు యుద్ధమును సేయగ గాండివమూని నిల్వుమా

శ్రీకృష్ణుడు అర్జునుని ' పరంతప !  (శత్రువులను తపింపజేయువాడా ! ) అని సంబోధించాడు సంబోధన మీద ఆధారపడి కృష్ణుని ఆంతర్యాన్ని  అర్థం చేసుకోవాలి.

కర్తవ్య నిర్వహణ, అనగా, యుద్దము చేయవలసిన, తరుణంలో అర్జునుడు శోకతప్తమానసు డయ్యాడుశత్రువులను తపింప చేయవలసిన అతి క్లిష్టమైన సమయంలో తన హృదయాన్ని తపింపజేసుకుంటున్నాడుబాధకు గురి చేస్తున్నాడుధైర్యాన్ని కోల్పోతున్నాడు. గాండీవాన్ని ప్రక్కన పెట్టాడుఅది అర్జునుడు చేయవలసిన పని కాదుయుద్దంలో శత్రువులను నిర్జించి ధర్మపరిరక్షణ చేయటం క్షత్రియధర్మంఅది శ్రీకృష్ణుడు కనిపెట్టాడు, రోగనిర్ధారణ చేశాడుదీనిని భగవంతుడు హృదయదౌర్బల్యం అంటున్నాడుహృదయము యొక్క దుర్బలత్వము చాలా నీచమైన పని. పిరికివాడికి ఉండే అవలక్షణంఅర్జునుని వంటి ధీరునికి, మహావీరునికి ఉండవసిన లక్షణం కాదు. పిరికివానికి హృదయ దుర్బలత్వం ఉంటుందిధైర్యం కలవానికి ఉత్సాహం ఉంటుందిహృదయదౌర్బల్యం అజ్ఞానం  వల్ల వస్తుందితెలియనితనం వల్ల వస్తుంది. దానిని ప్రక్కన పెట్టమంటున్నాడు భగవానుడువిడిచిపెట్టమంటున్నాడు.  ' ఉత్తిష్ఠ (లెమ్ము) అని దుర్బలత్వానికి గురైన హృదయంలో ఉత్సాహాన్ని నింపుతున్నాడుకార్యసాధకులను తయారుచేయవలసిన బోధకుడు చేయవలసిన మొట్టమొదటి పని ఇదేవారిలో పిరికితనాన్ని పోగొట్టాలిపిరికితనం పోతే, దాని స్థానంలో ఉత్సాహం దానంతట అదే వచ్చి చేరుతుంది కారణం చేత, శ్రీకృష్ణుడు మనిషి తత్వం గ్రహించి వైద్యం చేసే గొప్ప వైద్యుని వంటివాడుమహాభిషక్కుతత్వం తెలిసి మందు నిర్దేశిస్తే చక్కగా పని చేస్తుంది.

ఇదే, రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలోని శ్లోకంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు చేసిన బోధ.

సందర్భంగా నా భగవద్గీత అవగాహనకు మూలకారణం, యతీశ్వరులు, మహాజ్ఞాని, ఆధునిక కాలపు వివేకానందులు, పరమ హంస పరివ్రాజక శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారేనని, ఇందున్న అక్షరముల కూర్పు మాత్రమే నేను చేసిన పని అని, భగవద్గీతకు నాచే చేయబడు వ్యాఖ్యానమును చదువుతున్న ప్రతిసారి  పాఠకులు గుర్తుంచుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాను.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 365 (నన్నయ భారతము: సభాపర్వం: ద్వితీయాశ్వాసం)










పాలిత దుర్ణయుండు శిశుపాలుడు బాలుడు, వీని నేల భూ
పాలక ! నీకు బట్టు వఱుపన్? మఱి ధర్మ వెఱుంగ వీనికిం
బోలునె రాగకోప పరిభూత మనస్కున కల్పరాజ్య
క్ష్మీ లలనాంధబుద్ధి కనిమిత్త మహత్పరివాదశీలికిన్.

అవినయబుద్ధివై హరికి నర్ఘ్య మయోగ్యమ యంటి; నీవు మూ
ర్ఖవు శిశుపాల ! యింక బలుకన్ వలసెన్ సభలోన నున్న యీ
యవనిపులెల్ల నాతని దయO బరిముక్తులు, వానిచేత నా 
హవ జితులుం, దదీయశరణార్థులుగా కొరులయ్య చెప్పుమా !

భీష్ముడు శ్రీకృష్ణుడిని అగ్రపూజకు అర్హుడని నిర్ణయించటం శిశుపాలునికి కోపకారణమై, పరమాత్ముడిని పలు విధాలుగా నిందించాడుధర్మరాజు అతడిని బుజ్జగించటానికి ప్రయత్నించాడుఇది చూసిన భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు:

" ధర్మరాజా ! శిశుపాలుడు చెడు నడవడిక కలవాడుఇతని మాటలు, చేతలు చూస్తుంటే పిల్ల చేష్టలుగా ఉన్నాయిఇటువంటివాడికి ధర్మాన్ని గురించి ఎందుకు చెబుతావుఇతడు అసూయతో మాట్లాడుతున్నాడుఏదో తన చిన్న రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని చూసి విర్రవీగుతున్నాడుదానితో గుడ్డివాడిలాగా మంచిని చూడలేకపోతున్నాడుఅటువంటివాడికి ధర్మం తలకెక్కుతుందా? " 

తరువాత భీష్ముడు శిశుపాలుడి వైపు చూసి ఇలా అన్నాడు:

" శిశుపాలా ! నీవు వినయం లేకుండా కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వద్దని మాట్లాడుతున్నావుఇది పద్ధతి కాదుఇక్కడకు వచ్చిన రాజు లందరూ జరాసంధుని చెరలో నుంచి శ్రీకృష్ణునిచే విడిపింపబడినవారు  లేకపోతే ఆయన చేతిలో ఓడిపోయినవారు లేదా ఆయన శరణు కోరినవారుఅలాకాకుండా ఇతరులు ఎవరున్నారో చెప్పు. "

సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, సభాపర్వం, ద్వితీయాశ్వాసానికి డాక్టరు అప్పజోడు వేంకటసుబ్బయ్యగారు విశేష వ్యాఖ్యను అందించారుదానిని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

" పద్యాలు శిశుపాలుడి చెడు స్వభావాన్ని ప్రతిఫలించే అద్దములు. ధర్మతత్త్వాన్ని గ్రహించటానికి రాగద్వేషరహితమైన సమచిత్తం ఉండాలి. అహంకారం, అవివేకం ఉండకూడదుశిశుపాలుని స్వభావంలో ఉండవలసిన సమచిత్తత లేదుఉండగూడని అహంకారం, అవివేకం మెండుగా ఉన్నాయి. అందుచేత, ' ధర్మరాజా! ఇతనికి ధర్మతత్త్వాన్ని చెప్పి ఒప్పించే ప్రయత్నం వ్యర్థ ' మని భీష్ము డంటున్నాడుఅంతేకాదు, ' భూపాలక ! నేల నాలుగు దిక్కులు జయించి సార్వభౌమ యోగ్యమైన రాజసూయయాగం చేసే మహారాజా ! వీనిన్ - తక్కువవాణ్ణి, అల్పరాజ్య లక్ష్మీలలనాంధబుద్ధిని, అనిమిత్త మహత్పరిశీలవాదిని - ఒప్పించే ప్రయత్నం నీకు అనవసర ' మని కూడా అంటున్నాడు.

రెండవ పద్యంలో ' హరి ' శబ్దప్రయోగం ఉచితంగా ఉంది. శ్రీకృష్ణుని విష్ణుత్వం మీద, శిశుపాలుని మూర్ఖత్వం మీద మాట వెలుగులను ప్రసరిస్తున్నది.




ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like