ఘన కుపితాత్ముడై యమున గన్గొని రాముడు వల్కె డాయ జీ
రిన జనుదేక తక్కితి పురే ! విను నిందఱు జూడ మద్భుజా
సునిశిత లంగలాగ్రమున సొంపఱు నిప్పుడు నూఱు త్రోవలై
చన వెస జించి వైతు నని చండ పరాక్రమ మొప్ప నుగ్రు డై.
బలరామా! ఘనబాహ ! నీ యతుల శుంభద్విక్రమం బంగనల్
దెలియం జాలెడివారె? యీ యఖిలధాత్రీభారధౌరేయ ! ని
శ్చలసత్వుండగు కుండలీశ్వరుడునుం జర్చింప నీ సత్కళా
శ్రీ శుకుడు పరిక్షిత్తుకు చెబుతున్నాడు.
బలరాముడు ఒకరోజు తన బంధుమిత్రులను చూడటానికి వ్రేపల్లె వెళ్ళాడు. అక్కడ కొంతకాలం గడిపి, గోపికలతో కలిసి యమునాతీరానికి వెళ్ళాడు. అక్కడ ఇసుకతిన్నెల మీద చాలాసేపు సేదతీరిన తరువాత యమునలో జలకాలాడాలనిపించి యమునను దగ్గరకు రమ్మని పిలిచాడు. మద్యం సేవించి ఉన్నాడన్న మిషతో యమున బలరాముడి మాటను లక్ష్య పెట్టలేదు. కోపించిన బలరాముడు యమునానదితో ఇలా అన్నాడు.
" నేను రమ్మని పిలిస్తే నీవు రాలేదు. ఇప్పుడు వీళ్ళంతా చూస్తుండగా నా నాగలితో నిన్ను నూరు పాయలుగా చీలుస్తాను. "
లాంగలము = నాగలి
రాముడు తన హలాయుధంతో యమునానదిని లాగాడు. యమునానది భయపడి, స్త్రీ రూపం ధరించి, బలరాముడి దగ్గరకు వచ్చి, అతని పాదాలకు నమస్కరించి, ఇలా అన్నది.
" బాహుబల పరాక్రమం కలిగిన బలరామా! నీ సాటిలేని బలపరాక్రమాలు స్త్రీలకు తెలుసుకోవటం సాధ్యమా? ఈ సమస్త భూభారాన్ని తన నిశ్చలమైన సత్త్వసంపదతో, అటూఇటూ ఒరగకుండా మోస్తున్న ఆదిశేషువు కూడా నీ అంశ కలిగినవాడే. అటువంటి నీ భుజబలం సామాన్యమైనదా? " అంటే, అసామాన్యమైనదని భావం.
కుండలీశ్వరుడు = కుండలాకార శరీరము కలది, సర్పము. ఆదిశేషుడు.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమస్కంధములోని ఈ పద్యం శేషాంశ అయిన బలరాముని బాహువిక్రమాన్ని తెలియజేస్తున్నది.
No comments:
Post a Comment