తో సయ్యాటము లాడెదన్ గృపణబంధూ ! యెట్లొ సైరింతు వీ
దోసం బా నిగమాధ్వమం దుపనిషల్లోలాయతాక్షీపరీ
హాసశ్రీఁగను నీకు మత్కృతపరీహాసంబు విశ్వేశ్వరా !
' మా స్వామి ' లో పన్నెండవ పద్యమిది.
" ఓ స్వామీ ! అదేం పాపమో గాని, ఊహించుకొని హించుకొని నీతో పరిహాసాలాడుతూ ఉంటాను. ఈ అపరాధాన్ని ఎట్లా మన్నిస్తావో? వేదవీథుల్లో, ఉపనిషత్తులు ఊయలలూపే చతురవచోక్తులకు అలవాటుపడిన నీకు, నేను నీతో యీ పద్యాలలో చేసే పరిహాసోక్తులు దోషంగా అనిపిస్తాయా? "
విశ్వనాథ పరమేశ్వరుణ్ణి ' కృపణబంధూ ! ' అని సంబోధించాడు. కృపణుడు అంటే కుత్సితుడు. కుత్సితత్వం ఉన్నవాడికి వాచాలత్వం ఉంటుంది. వాచాలత్వం ఉన్నవారిని మన్నించేవాడు. విశ్వనాథవారివి పైకి పరిహాసోక్తులు, లోపల ఎనలేని భక్తిభావం. వేదస్వరూపుడైన దేవుడికి, భక్తిభావంతో మాట్లాడే పరిహాసపు మాటలు పట్టింపుకు రావని భావం. రెండవది, పార్వతీపరమేశ్వరులు విడదీయరాని ఒకే వెలుగు. ఆ వెలుగులో, వేదస్వరూపుడు పరమేశ్వరుడైతే, పార్వతి ఉపనిషల్లోలాయతాక్షి.
No comments:
Post a Comment