ధనమైపోయిన మమ్ముఁ బుత్రకుల మా దారిద్ర్యమున్ జూచి యీ
తని సేవింపుఁడటంచుఁ జెప్పి చనియెన్ మా తండ్రి, బంగారుకొం
డను జేఁదాల్చిన నిన్నుఁ జూపి, కనవా నా మాట? విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ముప్పదియేడవ పద్యం.
" విశ్వేశ్వరా! మా తండ్రి చేతిలో చెలరేగిన గొప్పదైన దాన మనే శౌర్యాగ్నికి ఆహుతైపోయిన కొడుకులను మమ్మల్ని, మా దరిద్రాన్ని చూసి, బంగారుకొండను చేతిలో దాల్చినటువంటి నిన్ను చూపించి, " ఇదిగో ! ఇతడిని సేవించండి. " అని ఆయన పరలోకానికి వెళ్ళాడు. స్వామీ ! మరి ఆ సంగతి చూడవా? నా మాటను ఆలకించవా ? "
త్రిపురాసుర సం హార కాలంలో, మేరుపర్వతాన్ని విల్లుగా చేసుకొన్నాడు శివుడు. మేరుపర్వతానికి బంగారుకొండ అని పేరు.
విశ్వనాథవారి ఆరాధ్య దైవం కాశీ విశ్వనాథుడు. నందమూరులో కొలువున్న శివునికి, అదే గ్రామంలోని వేణుగోపాల స్వామికి వారికి భేదం తెలియదు. అందుచేతనే రామకథాపరమైన శ్రీమద్రామాయణ కల్పవృక్షము అనే బృహత్కావ్యాన్ని శివునికి అంకితమిచ్చారు.
No comments:
Post a Comment