పురముల్ గాల్చుట కాదు, బ్రహ్మలిఖితంబున్ మార్చుటా కాదు, సం
సరణాంబోధి మహాపద ద్రిధుత తృష్ణా వీచి కల్లోల గ
హ్వరమౌ నా హృదయాన శాంతి నెలకొల్పన్ జూడు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఏభై ఎనిమిదో పద్యం.
" విశ్వేశ్వరా ! నన్ను రక్షించటం (కష్టాల నుండి బయట పడవేయటం) అంత తేలికని అనుకుంటున్నావేమో ! ఇదేమీ త్రిపురాలను కాల్చటం కాదు, బ్రహ్మ వ్రాసిన రాతను మార్చటం అంతకన్నా కాదు. సంసారమనే సముద్రపు అలల చేత అల్లకల్లోలం చేయబడిన, గొప్ప ఆపదల చేత చుట్టుముట్టబడిన, హృదయమనే కొండగుహలో శాంతిని నెలకొల్పాలి సుమా ! "
శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు. అలాగే, విధివ్రాతను మార్చి, మార్కండేయుడిని చిరంజీవిని చేశాడు. అవి ఆయన చేతి లోనివి. జీవుని అంతులేని కోరికలు తీర్చి, అతడికి శాంతిని ప్రసాదించటం పరమేశ్వరునికి కూడా సాధ్యం కాదేమోనని విశ్వనాథ వాపోతున్నారు.
No comments:
Post a Comment