లోనన్ దల్పఁగనైన రానివి దయాలోకాంబుధారాప్రవా
హానన్ క్షాళన చేసివైచెదవొ, లేదా రౌరవాగ్నిస్ఫులిం
గానీకంబుల నూరెదో రురువిషాణశ్రేణి? విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని అరవైఅయిదో పద్యం.
" విశ్వేశ్వరా ! నేను చెప్పటానికి కూడ వీలులేనన్ని పాపపు పనులు చేశాను. చివరికి, మనసులో తలచుకోవటానికి కూడ సాధ్యం కానివి. మరి నీ దయాలోకాలు అనే జలధారలతో కడిగివేస్తావో లేక రౌరవ నరకం లోని అగ్నిజ్వాలల్లో, దుప్పి కొమ్ముల వంటి పాపాల సమూహాన్ని కాల్చివేస్తావో? నీ ఇష్టం స్వామీ ! "
రౌరవం అనేది నరకలోకం లోని ఒక శిక్షావిభాగం.
' రురువిషాణశ్రేణి ' అంటే దుప్పి కొమ్ముల సమూహం. దుప్పి కొమ్ములు పొడుగ్గా, ప్రక్కన శాఖలతో, విస్తరించి ఉంటాయి. పాపసముహం కూడా, ఒకదాని నుండి ఒకటి పుట్టుకొస్తుంది.
' రురువిషాణశ్రేణి ' అన్న ప్రయోగానికి సంబంధించి నేను చేసిన అన్వయం నాకు సంతృప్తికరంగా లేదు. పెద్దల నుండి తెలుసుకొనవలసి ఉన్నది.
No comments:
Post a Comment