మ్ములునున్ ముమ్మొనవింటిబద్దయుఁ గరాంభోజాతయుగ్మంబునన్
మలరాకూఁతురు బోయసాని వెనువెంటన్ రాగ మాయామృగ
మ్ముల వేఁటాడుఁ బుళిందరాజు నిను సంపూజింతు విశ్వేశ్వరా !
' మా స్వామి ' లో ఏడవ పద్యమిది.
" విశ్వేశ్వరా ! తలపైన చంద్రుడిని నెమలిపించంగా ధరించి, నాలుగు వేదాలు నాలుగు కుక్కలవలె నీ ముందు నడుస్తుండగా, మూపుపై అమ్ములపొది, చేతిలో మూడు మొనలున్న కర్ర పట్టుకొని, కొండదొర కూతురు బోయసాని నీ వెంట రాగా, మాయామృగాలను వేటాడే కిరాతరాజువైన నిన్ను నిండారా భక్తితో కొలుస్తాను. "
అర్జునునకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించటం కోసం శివుడు మాయాభిల్లుని వేషం ధరించటం అందరికీ తెలిసిన విషయమే. ఆ కిరాతార్జునీయ ఘట్టాన్ని ఛందోబద్ధంగా, అందంగా మలిచారు విశ్వనాథ.
భక్తిభావాన్ని కల్గించే ఈ పద్యాన్ని ఎన్నిసార్లు చదువుకున్నా తనివితీరదు. మాయాభిల్లుని వేషం ధరించిన పరమేశ్వరుడు జీవుల మాయను తొలగించు గాక !
No comments:
Post a Comment