థ్యాసౌఖ్యం బనిపించు దుఃఖమయ జన్మానేక మూహింపఁగా
సీ సీ పో యనుఁగాని వానిపయినే చిత్తంబు లగ్నంబగున్
భాసాభాసము నీదు చిన్మయప్రభావజ్యోతి విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని అరవైమూడో పద్యం.
" విశ్వేశ్వరా ! ఈ సంసారం వల్ల ఇల్లు, ఒళ్ళు గుల్లవటమే కానీ, ఇంకేమీ ప్రయోజనం కనిపించటం లేదు. ఈ సంసారసౌఖ్యం ఒక మాయ అని అనిపిస్తున్నది. దీని వల్ల ప్రాప్తమయ్యే దుఃఖమయమైన జన్మపరంపరలు తలచుకొంటే ' ఛీ ! ' అని అసహ్యం వేస్తుంది. కానీ మనసు మళ్ళీ దానివైపుకే లాగుతున్నది. స్వామీ ! సత్యాసత్యాలు నీ జ్ఞానప్రభావం చేత వెలుగొందేవే కదా ! "
ఈ జగత్తులో చేతనాలు, అచేతనాలు అన్నీ పరమేశ్వరుని స్వరుపాలే. అందువల్ల, ఈ మిథ్యాజగత్తులోని సంసారం ఆయన చిత్ప్రభావమే అని విశ్వనాథ మనవి చేసుకొంటున్నారు.
No comments:
Post a Comment