బత్తర్కాగమ ముద్భవించె భవదీయాంబూకృతిన్ వేదముల్
త్వత్తస్సంభవముల్ శివా ! యుపనిషత్వంబందె నీ మేను వి
ద్యాత్తాకారునిఁ బొంద నా కవిత కౌనా నిన్ను విశ్వేశ్వరా !
ఇది " మా స్వామి " లోని పదునైదవ పద్యం.
" విశ్వేశ్వరా ! నీ తాండవనృత్యం చివర భేరీనాదం నుంచి ప్రణవం పుట్టింది. నీ ముఖం నుండి తర్కశాస్త్రాలు పుట్టాయి. చతుర్వేదాలు కూడా అక్కడ నుండి ఉద్భవించినవే. నీ శరీరమంతా ఉపనిషత్తుల సారమే. అటువంటి సర్వవిద్యాస్వరూపిడివైన నిన్ను నా కవిత్వం ద్వారా పొందాలంటే సాధ్యమా ! "
వేదముల, ఉపనిషత్తుల, షట్ఛాస్త్రముల సారం పరమేశ్వర తత్వం. అది వాక్కునకు, మనస్సునకు అందనిది - " యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ " - అని తైత్తరీయోపనిషత్తు చెబుతున్నాడు.
No comments:
Post a Comment