శక్త్యాశాభయ లోభ మోహమద తృష్ణావల్లికల్ ద్రెంతు, ధీ
శక్త్యుత్సాహములన్ దమఃప్రకృతిలో సారింతు జ్యోతిర్లతల్,
భక్త్యావేశ మొసంగితేని యొకఁ డప్పా ! నాకు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఇరవైనాలుగో పద్యం.
" విశ్వేశ్వరా ! మోక్షమార్గంలో వెళ్తున్న నేను నీ పాదాల వంపులను పూలతో పూజిస్తాను. నాలో గూడుకట్టుకొని ఉన్న విషయాల మీద అభిలాష, ఆశ, భయం, లోభం, మోహం, మదం అనే తీగలను త్రుంచివేస్తాను. ధైర్యం, శక్తి, ఉత్సాహాలను ఆయుధాలుగా చేసుకొని, అజ్ఞానమనే చీకటిలో, వెలుగును ప్రసరింపచేస్తాను . కానీ స్వామీ ! ఇవన్నీ చేయాలంటే నాలో భక్త్యావేశాన్ని కలిగించు. "
మోక్షపథగామికి దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అరిషడ్వర్గాలు, ఈషణత్రయం మొదలైనవి, కాళ్ళకు తీగల్లాగా తగులుకొని, ముందుకు కదలనీయవు. వాటిని చాలా ధైర్యంగా, శక్తినంతా కూడగట్టుకొని, ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలనే తపనతో త్రుంచివేసుకోవాలి. త్రుంచివేసుకొనటం అంత సులభం కాదు. దానికి భగవంతుని కృప తోడవ్వాలి. అందుకని, భక్త్యావేశం కలిగించమని వేడుకుంటున్నాడు కవి.
No comments:
Post a Comment