పాయవ్యాప్తికి బుద్ధిపోదు, కృపణత్వం బొప్ప దుర్మార్గులం
దే యాచ్ఞామతి స్తోత్రపాఠము లొకింతేఁ జేయగాఁ జాలఁ దం
డ్రీ ! యీ జీవితనౌక పట్టఁగల దొడ్డేరీతి, విశ్వేశ్వరా!
డ్రీ ! యీ జీవితనౌక పట్టఁగల దొడ్డేరీతి, విశ్వేశ్వరా!
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని నలభై నాలుగో పద్యం.
" విశ్వేశ్వరా ! నాకు ఏవో మాయ మాటలను చెప్పి పనులను చక్కబెట్టుకోవటం చేతకాదు. ఇతరుల సంపదను ఏ రకంగా పొందాలా అనే దుర్మార్గపు ఉపాయాలను పన్నటానికి మనస్కరించదు. ఏవేవో ఉపకారాలను పొందాలని దుష్టులను పొగడటం చేయలేను. తండ్రీ ! మరి యీ జీవితనౌక ఏ విధంగా ఒడ్డుకు చేరుస్తావో నీదే భారం. "
విశ్వనాథ లోకవ్యవహారాన్ని యీ పద్యంలో చక్కగా చూపించారు. చాలామంది, ఏవో మాయమాటలు చెప్పి వారి పనులను చక్కబెట్టుకుంటారు. పరుల సొమ్ముపై ఆశ పడటం, దానిని కాజేయటానికి దుష్ట పన్నాగాలను పన్నటం మనందరికీ తెలిసిన విషయమే. అధికారులను, సమాజంలో పేరుప్రతిష్ఠ లున్నవారిని పొగిడి పనులు సాధించుకొనే వారికి కొదువ లేదు. ఇవేమి చేయటం చేతగానివాడిది అసమర్థుని జీవయాత్ర.
No comments:
Post a Comment