త్యాద్వైతాఖిలలోకగర్భపరిపూర్ణానంద చంద్రుండవై,
మద్వాగ్లేశము చేతఁ గట్టువడి యీ మర్యాద పాటింతు నా
హృద్వేగోద్గత బాష్పముల్ గొనుము తండ్రీ ! కాన్క ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ఇరవైరెండో పద్యం.
" విశ్వేశ్వరా ! నీవు చిత్స్వరూపానివి. అచ్చమైన వెలుగువి. నిత్యమైన వాడివి. ఏకమైన తత్త్వస్వరూపుడివి. అన్ని లోకాల లోను, అన్నీ ప్రాణుల లోను వెలుగొందే ఆనందస్వరూపానివి. నీ కృప చేత సం ప్రాప్తమైన యీ కవిత్వాన్ని, ఏదో మర్యాదకు కట్టుబడి వింటున్నావు . నా గుండెలోతుల నుండి వేగంగా స్రవిస్తున్న వేదనాభరితమైన అశ్రుధారలను నీకు కానుకకగా సమర్పిస్తున్నాను, తీసుకో తండ్రీ ! "
పరమేశ్వరుడు సచ్చిదానందస్వరూపుడు. నిర్గుణతత్త్వం. ఆ తత్త్వం అద్వైత తత్త్వం. జీవబ్రహ్మాత్యైకానుసం ధానం కలిగించేది. కవి, ఆ అద్వైతసిద్ధి కోసం పరితపించే జీవుని వేదనను ఈ పద్యంలో తెలియజేశారు.
No comments:
Post a Comment