వ్యాఘ్రంబున్ బలె మోసపుచ్చవుగదా పైకెంతొ లోనంతయే
శీఘ్రంబచ్చొటికేఁగి తాపసుఁడనై చింతింప వాంఛింతు వ్యా
జిఘ్రన్మోక్షపథాశ మిక్కుటమయా చిత్తేశ ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని అరవై యెనిమిదో పద్యం.
" విశ్వేశ్వరా ! నేను అడవుల్లో నివసించటానికి వెళ్తే, అక్కడ పెద్దపు లున్నాయని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే, అక్కడ మానవ సమాజంలో ఉన్నట్లుగా గోముఖవ్యాఘ్రాలు మోసం చేయవు కదా ! అరణ్యంలోని మృగాలు పైకి ఎలా కనపడతాయో, లోపల కూడా అట్లాగే ఉంటాయి. అందుచేత, నేను త్వరగా అరణ్యానికి వెళ్ళి, తపస్సు చేసుకోవాలని కోరుకొంటున్నాను. నీవు నా చిత్తాన్ని పాలించే ప్రభువువి. అభిలషణీయమైన ముక్తిమార్గం మీద నాకు ఆశ యెక్కువ తండ్రీ ! "
ఈ పద్యంలో, మానవ సమాజంలోని, మోసప్రవృత్తి కల గోముఖవ్యాఘ్రాల గురించి ప్రస్తావించి, అక్కడ కంటె అరణ్యంలో ప్రశాంతత యెక్కువని, తాపసవృత్తిలో కొనసాగి, మోక్షసిద్ధి కోరుకుంటున్నానని చెప్పారు.
No comments:
Post a Comment