నా స్వాతంత్ర్యము నా మతిప్రతిభ నానా మత్ప్రభావంబులున్
భాస్వన్మత్పితృరక్త గౌరవము కింభాగ్యంబుగాఁ జేతు నా
యీ స్వాంతాలయ నిత్యపూజలకు నీ కే లోటు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ఏభైమూడో పద్యం.
" విశ్వేశ్వరా ! ఇదేమి న్యాయ మని అడుగుతున్నా నయ్యా నిన్ను. దరిద్రం అనే పేరు చెప్పి, నా స్వాతంత్ర్యం, నా కవితాప్రతిభ , అనేక విధాలైన నా ప్రజ్ఞా పాటవాలు, అన్నిటినీమించి, వారసత్వంగా నా తండ్రి నుంచి సంక్రమించిన రక్తనిష్టమైన గౌరవం, అన్నీ నిరుపయోగమయ్యేటట్లు, నన్ను అదృష్టహీనుడిగా జేస్తున్నావు. దీనివల్ల, నేను మనస్సనే దేవాలయంలో నీకు చేసే నిత్యపూజలకు లోటు గాని, నాకేమయ్యా, స్వామీ ! (నా మనస్సనే దేవాలయంలో నేను చేసే నిత్యపూజలకు ఏం లోటు చేశాను?) "
విశ్వనాథ గాఢప్రతిభుడు. కావ్యానేక బ్రహ్మాండస్రష్ట. బ్రాహ్మీమయమూర్తి. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. దుర్భర దారిద్ర్యాన్ని చవిచూశాడు.
No comments:
Post a Comment