గనులన్ జోరున బాష్పముల్గురియుదున్ గాద్గద్యముల్ పొందుదున్
దనివోకే యెదలోని భావములు పద్యా లల్లి నా గుండెతోఁ
జని లోకంబును జూచి పుచ్చెదను నిశ్వాసాలు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని అరవై తొమ్మిదో పద్యం.
" విశ్వేశ్వరా ! నిన్ను కళ్ళారా చూడాలని పూజలు చేస్తాను. నీ రూపాన్ని లోపల తలచుకొని, ధారగా కన్నీరు కారుస్తాను. గొంతు బొంగురుపోతుంది. అంతటితో తృప్తిచెందక, నా హృదయంలోని భావాలను పద్యా లల్లి, నా గుండెతో యీ లోకాన్ని చూస్తాను. లోకం తీరు చూసి నిట్టూర్పులు విడుస్తాను. "
భగవత్సంబంధమైన భావన మనసులో చొరబడగానే పైన చెప్పిన మార్పులు జరగటం సహజం. అయితే సృజనాత్మక కవి విషయంలో ఇది కొంచెం భిన్నగా ఉంటుంది. కవి, తన గుండెలో గూడు కట్టుకొన్న భావాలకు పద్య రూపమిచి లోకాన్ని విశ్లేషిస్తాడు, సంస్కరించటానికి ప్రయత్నిస్తాడు. లోకం పోకడ వెర్రితలలు వేస్తుంటే నిట్టురుస్తాడు.
No comments:
Post a Comment