ఠిన్యంబున్ గొను నాదు వాక్కు శివ! తట్టీకల్ మహాకైతవో
పన్యాసంబులఁ జేయుచుందురు ఖలుల్ ప్రభ్రష్ట సన్మార్గు లే
మన్యుప్రక్రియ లోకవృత్తి నడచున్ మా యందు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని నలభై ఆరవ పద్యం.
" విశ్వేశ్వరా ! లోకంలో అన్యాయం జరుగుతుంటే, నాకు ఒళ్ళు భగ్గుమని మండుతుంది. దానితో మాట పరుషంగా వస్తుంది. సన్మార్గదూరులైన వీళ్ళు పెద్ద పెద్ద దుష్టమైన ఉపన్యాసాలు చేస్తుంటారు. ఇటువంటి వారున్నప్పుడు, ఎటువంటి మానవస్వభావంతో, మా వంటివారు లోకవ్యవహారాన్ని సాగించాలి ? "
లోకంలో అధర్మ ప్రవృత్తి కలవారే యెక్కువ. అందువల్ల, అటువంటివారి మాటే చలామణి అవుతుంది. నిజం యెప్పుడూ నిష్ఠురంగా ఉంటుంది. అందుల్ల, అటువంటివాడికి నోటి పొగరెక్కువ అని బిరుదు అంటగడతారు. ఋజుప్రవర్తన యెక్కువగా రాణింపుకు రాని సమాజంలో, విశ్వనాథ వంటివారు కూడా కఠినస్వభావులని, గర్విష్ఠులని మాటలు పడక తప్పలేదు.
శిష్యులకు, అనుయాయులకు, ఆయన వద్ద నుండి గుప్తదానాలు పొందినవారికి, విశ్వనాథది " నిండుమనంబు నవ్యనవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము " అని అనిపించకమానదు.
No comments:
Post a Comment