నః పాండిత్య దురంధరాఖిల సురానంతాధ్వ ఘాసచ్ఛటల్,
నిఃపర్యాప్త సుఖాలు కోరుటకుఁ బోనే పోదు నీ దివ్య స
ద్యః పారంగత చిన్మయాకృతి సదైక్యం బిమ్ము, విశ్వేశ్వరా!
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ఇరవైఆరో పద్యం.
" విశ్వేశ్వరా ! నేను స్వర్గలోకం లోని బంగారు శిఖరాల స్వచ్ఛమైన కాంతిని కానీ, సుందరమైన నందన వనాలను, పచ్చిక మైదానాలను కానీ, యధేచ్ఛగా అనుభవించగలిగే సుఖాలను కానీ, కోరటం లేదు. నీ చిన్మయాకృతితో ఐక్యమయ్యే భాగ్యాన్ని కలిగించు. "
ఈ పద్యం లోని భావం పూర్తిగా అర్థం కాలేదు. రెండవ పాదానికి అర్థం తెలియలేదు. మొత్తం మీద, కవి శివునితో తాదాత్మ్యాన్ని కోరుతున్నాడని అనుకుంటాను.
No comments:
Post a Comment