స్వద్యోషార్థము, చంచలభుజగరాజన్మంజుహారంబు, శౌ
క్లద్యుత్యూర్జిత దీపితావయవ సమ్లానంబు, నీ మూర్తి, భ
క్తాద్యుజ్జీవనరంహ మేమనుదు మద్భాగ్యంబు? విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై నాలుగో పద్యం.
" విశ్వేశ్వరా ! స్వేదంతో కూడిన నీ నుదురు, ఇంచుక కంపిస్తున్న పెదవులతో, క్రొత్త అందాన్ని ఒలికిస్తూ, అప్పటికప్పుడు ఉద్వేగము పొంది ప్రకాశిస్తున్న, అర్థభాగమైన నీ స్త్రీరూపం, అందమైన కంఠహారంగా, కదులుతున్న నాగరాజు వాసుకి, శుక్లపక్ష వృద్ధిచంద్రుని కాంతిచేత వెలుగొందుతున్న నీ అవయవ సంపద - వీటన్నిటితో కనిపిస్తున్న నీ రూపం - భక్తుల యొక్క జీవితాలను వెలిగింపజేసేది. భావనాజగత్తులో అటువంటి దివ్యదర్శనం చేయగలిగిన నా అదృష్ట మేమని చెప్పాలి. "
శివుడు అర్థనారీశ్వరుడు. ఆ స్వరూపం ప్రకృతిపురుషుల కలయిక. అదొర మహాచైతన్యం. అందువల్ల, భావనలో, ఆ స్వరూప దర్శనం ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది.
No comments:
Post a Comment