కలు సింగారముగా నమర్చి చెవులన్ గంపింపగాఁ బాఁప పో
గులు మేనన్ బులితోలువైచుకొని కొంగుల్ జారఁ బ్రేమంపు జూ
పుల సంధ్యాసతిఁ జూచు నీ సొగసు మమ్మున్ బ్రోచు విశ్వేశ్వరా !
' మా స్వామి ' లో ఎనిమిదవ పద్యమిది.
"చల్లని ఆకాశగంగను తెల మీద ఒక పార్శ్వంలోను, సొగసైన చంద్రఖండాన్ని పూరేకుగా ఇంకొక పార్శ్వంలోను సింగారంగా అమర్చుకొని, చెవులకు అటూఇటూ ఊగుతూ పాములని పోగులుగా పెట్టుకొని, వంటిపై పులిచర్మాన్ని కప్పుకొని, కొంగులు జారుతుండగా ప్రేమతో అమ్మవారిని చూసే నీ సొగసు మమల్ని రక్షించు గాక ! "
మిన్నేరు ఆకాశగంగ. జాబిల్లి పూరేక అర్థచంద్రుడు.
శివుని సగుణాకారమిది.
No comments:
Post a Comment