గ్రైవేయీకృత కాద్రవేయ ! గళరుద్రాక్షీభవద్బాడబా !
సేవాస్వీకృత భూతరాక్షస పిశాచీప్రేత ! నేత్రప్రభా
శ్రీవిన్యస్త కృశాను ! పార్వతమృగాక్షీదార ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ఇరవైమూడో పద్యం.
" విశ్వేశ్వరా ! నీ నేర్పు, కూర్పు, చాలా చిత్రమైనది కదా ! ఎందువలననగా, నీవు చంద్రుడిని శిరోరత్నంగా దాల్చినవాడివి. సర్పాంగదకంఠహారుడివి. మెడలో రుద్రాక్షలను ధరించి, పుట్టుక అనే బడబాగ్నిని ఆర్పివేసేవాడివి. భూత, రాక్షస, పిశాచ, ప్రేత, గుహ్యక, మనుష్య, దేవ, గంధర్వ, విద్యాధర, సిద్ధ, సాధ్యులతో కూడిన ప్రమథగణాల సేవ లందుకొనేవాడివి. సూర్యచంద్రాగ్నులను మూడు కన్నులుగా కలిగినవాడివి. అన్నిటినీ మించి, పార్వతి అనే లేడికన్నుల చిన్నదానిని భార్యగా పొందినవాడివి. "
విశ్వనాథవారు శివుని పరంగా వాడిన విశేషణాలు మంత్రపూతము లనిపిస్తాయి. అవి కర్ణరంధ్రాలలో పడినంతనే, భక్తిభావం పొంగుకొస్తుంది. శివుని నేర్పు, కూర్పు చిత్రమైనట్లే, విశ్వనాథవారి పదాల కూర్పు, నేర్పు చాలా చిత్రమైనది.
No comments:
Post a Comment