డ్రీ ! సర్వాశలు యత్నముల్ ఫలితముల్ నీ మీఁదనే పెట్టి యా
యాసం బొక్కఁడె నే మిగిల్చుకొని సర్వానేహమున్ బుత్తు నీ
వేసం బూర్జిత చంద్రచూడ మెటులన్ వీక్షింతు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భయ్యో పద్యం.
" విశ్వేశ్వరా ! నీవు సాయంత్రం వేళ దర్శన మిస్తావని, ఏ రోజు కా రోజు ఎదురుచూపులు చూశాను. నా ఆశలు, ప్రయత్నాలు, ఫలితాలు, అన్నీ నీ మీదనే పెట్టుకొన్నాను. కానీ, అన్నీ అడియాశ లయిపోయినాయి. వృధాశ్రమ మాత్రం మిగిల్చుకొని, మొత్తం ఇహలోక యాత్ర సాగిస్తున్నాను. తండ్రీ ! ఇక దివ్యమైన నీ చంద్రశేఖర రూపాన్ని ఏ విధంగా చూడగలను? "
శివుడు లయకారకుడు కావున సాయసంధ్యా కాలం లోని అర్చన, అభిషేకాదులని ఇష్టపడతాడు. మృత్యుంజయుడు, జీవుడిని మృత్యువు నుండి అమృతత్వం వైపుకి తీసుకువెళ్తాడు. అందుచేత, అమృతాంశుడిని (చంద్రుడిని) మౌళిపై ధరించిన చంద్రశేఖరుని రూపాన్ని చూడాలని విశ్వనాథ అభిలాష. అనగా, మహాకవి అమృతత్వ సిద్ధిని కోరుకొంటున్నారు.
No comments:
Post a Comment