న్నెలలోఁ జల్లని పిల్లగాలి పొరలో నెమ్మేను చేర్పన్ నెలం
తల లేనవ్వుల సోగబుగ్గ గిలిగింతల్ వెట్ట, నెంతెంత కో
ర్కులు నా కున్నవొ, అంత నిన్నుఁ గను కోర్కుల్ లేవు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఏభై ఏడో పద్యం.
" విశ్వేశ్వరా ! తెల్లని పూలతో అలంకరించిన పానుపు మీద నిద్రించాలని, లేత వెన్నెలలో చల్లని పిల్లతెమ్మెరలు వీస్తుండగా హాయిగా విశ్రాంతి తీసుకోవాలని,, ప్రియురాలి చిరునవ్వుతో కూడిన అందమైన బుగ్గలు మనస్సును గిలిగింతలు పెట్టాలని యెంతటి కోరికలు నాకున్నాయో, అంతటి తీవ్రమైన కోరికలు నిన్ను చూడాలని మాత్రం లేవు. "
భోగాలను కోరుకొనే జీవుడు ఊహాలోకాల్లో తేలిపోతుంటాడు. భోగానురక్తి కల మనస్సు దైవానురక్తిని కోరుకోదు. ఈ విషయాన్నే విశ్వనాథ ఈ పద్యంలో చెప్పారు.
No comments:
Post a Comment