గౌంప్రాణాక్షర లేఖనాచతుర హస్తాంభోజ ! ఓ స్వామి ! సా
యంప్రాతస్సుల సంగమంబునను బూర్వాహ్ణాపరాహ్ణంబులన్
సంప్రీతాతుడ వెప్పు డౌదువు భవా ! సర్వజ్ఞ ! విశ్వేశ్వరా!
" మా స్వామి " శతకంలో ఇది పదహారవ పద్యం.
" విశ్వేశ్వరా ! నిన్ను మోక్షప్రదాతవని చక్కగా ప్రార్థిస్తాను. ఓ స్వామీ ! నిన్ను ఏ సమయంలో నిన్ను పూజిస్తే పూర్తిగా సంతుష్టుడివౌతావు? సాయంసంధ్య, ప్రాతఃసంధ్యల సంగమ కాలంలోనా? దినం లోని పూర్వభాగంలోనా ? లేక, ఉత్తరభాగంలోనా? నీవు సర్వజ్ఞుడివి. నీకు అన్నీ తెలుసు. నన్ను భవబంధ విముక్తుడిని చేయి. "
శివుడు అభిషేకప్రియుడు. అందులోనూ, సంగమకాలంలో పూజను యెక్కువగా ఇష్టపడతాడు.
ఇక విశ్వనాథ వాడిన విశేషణం " మోక్షయువతీ సం ఫుల్ల పీనస్తనా గౌంప్రాణాక్షర లేఖనాచతురహస్తాంభోజ ! " అనేది సంగ్రహంగా మోక్షయువతి యొక్క వక్షసౌందర్యాన్ని చక్కగా లిఖించగల తామరలవంటి చేతులు కలవాడా ! " అని అర్థం.
No comments:
Post a Comment