సింహస్వామి ! భవత్ప్రగర్జనల దిక్సీమల్ ప్రతిధ్వానతా
రంహఃఖేదము పొంది భీతిమెయిఁ దత్రత్యుల్ నిశాటుల్ ' నచా
హం హంతవ్య ' యటంచు వ్రాలెదరు భార్యల్ కాళ్ళ, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని పంతొమ్మిదవ పద్యం.
" విశ్వేశ్వరా ! ఏనుగు కుభస్థలాన్ని కనుక సింహం ఎట్లా చీలుస్తుందో, ఆ విధంగా, శ్వేతదీపం లోని వైకుంఠధామలో ఉండే నీవు, నారసింహరూపుడివై, భక్తుల పాపాలను పోగొడతావు. ఆ కళలో నీవు ఆరితేరినవాడవు. దిక్కులు పిక్కటిల్లేటట్లు నీవు చేసే గర్జనలతో భయపడిన రాక్షసులు " అయ్యో ! మేము కూడా చంపబడుతున్నాము " అని రోదిస్తుంటే, వారి భార్యలు నీ కాళ్ళ మీద పడి వేడుకొంటారు. "
శ్రీ మహావిష్ణువు శ్వేతద్వీపంలోని వైకుంఠధామలో ఉంటాడు. ఆయన నరసింహావతారమెత్తి ప్రహ్లాదుడిని రక్షించాడు. ఆ ప్రహ్లాదవరదుడిని ఆశ్రయిస్తే, ఏనుగు కుంభస్థలాన్ని సింహం చేదించినట్లు, నరసిం హస్వామి భక్తుల పాపాలను పటాపంచలు చేస్తాడు.
విశ్వనాథ ఈ పద్యంలో శివకేశవులకు అభేదాన్ని చూపించారు. వారు చిన్నతనం నుండి కొలిచిన వేణుగోపాలస్వామికి, కాశీ విశ్వేశ్వరునికి భేదం లేదు.
No comments:
Post a Comment