శ్రీ కంజాతములన్ దగుల్కొనియెఁబో చిత్తంబు దానన్ ననున్
జేకో బాధ్యత నీకయున్నయది తూష్ణీంభావ మేలా ప్రభూ !
నా కుయ్యింతయు నీచెవిన్ జొఱద సంధ్యాదార ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని అరవైనాలుగో పద్యం.
" విశ్వేశ్వరా ! నాకు పుర్వజన్మల పుణ్యఫలం వల్లనో యేమో గానీ, నీ పాదపద్మాల మీద మనస్సు లగ్నమయింది. అందువల్ల, నన్ను దరిచేర్చ వలసిన బాధ్యత నీ పైనే ఉంది. ఇంకా యీ మౌనమెందుకు ప్రభూ ! పార్వతీరమణా ! నా మొర కొంచెం కూడా నీకు వినబడదా? "
పూర్వజన్మల కర్మల ఫలితంగానే, ఈ జన్మలోని మంచిచెడులు ఆదారపడి ఉంటాయి. జీవునికి భగవంతుని మీదికి దృష్టి మరలిందంటే అది గతజన్మల పుణ్యఫలమే అని విశ్వనాథ ప్రగాఢ విశ్వాసం.
No comments:
Post a Comment