ద్ఘంటామార్గము లల్పశాత్రవసతీ కంఠాగ్రసూత్రావళీ
లుంటాకంబులు, మోక్షపట్టణ చరల్లోలాక్షి కాంచీరవ
ద్ఘంటానాదము లాశ్రితావనకళాత్త శ్రీలు, విశ్వేశ్వరా!
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ఇరవైయెనిమిదో పద్యం.
" విశ్వేశ్వరా ! చూశావా ! నీ పాదాలు ఉపనిషత్తుల లోని మహార్థాన్ని స్ఫురింపజేసే చక్కని రాజమార్గం. అవి దైత్యాధముల భార్యల మంగళసూత్రాలను హరించేవి. కామాక్షి అమ్మవారు తిరుగాడే మోక్షపట్టణం కాంచీపురం లోని గుడిగంటల మ్రోతలు. శరణు కోరిన వారిని రక్షించటం అనే కళలో సమృద్ధి కలిగినవి. "
పరమేశ్వరుడు వేదస్వరూపుడు. ఆయన తత్వం ఉపనిషత్తుల సారం. ఆయన దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసేవాడు. ఆయనే సగుణరూపంలో, మోక్షపట్టణమైన కాంచీపురంలో కొలువున్న ఏకాంబరేశ్వరుడు.
No comments:
Post a Comment