నడకల్ వోయినఁ గంటకాధ్వములకే నన్నీడ్చు విద్యానిధిన్
జడుఁడట్టుల్ సుజనున్ దురాత్ముఁడటు ప్రజ్ఞావంతు సామర్థ్యహీ
నుఁడువోలెన్ గనిపింపఁ జేతు విది యెంతో వింత, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని నలభై రెండో పద్యం.
" విశ్వేశ్వరా ! నా అదృష్టం సందెచీకట్లుగా కనిపిస్తున్నది. ఏ దారిన పోయినా, అది ముళ్ళత్రోవలకే దారి తీస్తున్నది. నీవు పండితుడిని మూఢుడిగాను, మంచివాడిని చెడ్డవాడిగను, సామర్థ్యవంతుడిని సామర్థ్యహీనుడిగను కనిపించేటట్లుగా చేస్తావు. ఇది యెంతో వింత కదా ! "
అదృష్టం అంటే విధి. విధి, భగవంతుడు వేరు కాదు. భగవంతుడు జీవులను వారి కర్మఫలాలను అనుభవించేటట్లుగా చేస్తాడు. అందువల్ల పరిస్థితులు తారుమారయినపుడు, దేవుడి దయ లేదనుకోవటం మానవ సహజం. మానవుని దృష్టిలో, అది ఒక వింత. దేవుని దృష్టిలో, అది వారి కర్మఫలాలను అనుభవింపచేయటం.
No comments:
Post a Comment