ప్రావీణ్యాత్ములఁ దత్తదాచరణ భారం బూనగాఁ జేసి
నానావిశ్వంబు లనంతగోళము లనంతాకాశ సంభ్రాంతముల్
గా విశ్వాత్మ ! త్వదాత్మనీనములుగాఁ గావింతు విశ్వేశ్వరా !
' మా స్వామి ' లో ఐదవ పద్యమిది.
శ్రీవాణిగిరిజలు, లక్ష్మి, సరస్వతి, పార్వతులు. వారి నాథులు వరుసగా విష్ణువు, బ్రహ్మ, శివుడు. ఈ త్రిమూర్తులు, పైన చెప్పబడిన వరుసలో స్థితి, సృష్టి, లయకారకులు. వారిని దానిలో ప్రావీణ్యము కలవారిగా చేసింది పరమశివుడు. ప్రావీణ్యులుగా చేయటమే కాదు, వారు, వారి వారి పనులను చక్కగా నిర్వహించేటట్లుగా చేసి, అనేకములైన గ్రహాలను, విశ్వాలను, అనంతమైన ఆకాశంలో పరిభ్రమించేటట్లుగా చేసి, వానిలో అంతర్యామిగా వెలుగొందుతున్న విశ్వాత్మ, పరమేశ్వరుడు.
విశ్వనాథ ఈ పద్యంలో పరమేశ్వరుని యొక్క సర్వాంతర్యామిత్వాన్ని గురించి చెప్పారు.
ఈ పద్యం పరమేశ్వర భావనను గుండె నిండా నింపుకొని ధ్యానం చేసుకొనటానికి ఉపయుక్తంగా ఉంది.
No comments:
Post a Comment