తే నేఁడే చని యేగిరీంద్రములనో నిద్రింతు, నే వాగులందో
నీరానెద, నే ఫలావళులొ తిందున్, బర్ణముల్ మేసెదన్
నీ నిష్ఠాగతి నీవుగాక మరి లేనే లేను, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఏభై నాలుగో పద్యం.
" విశ్వేశ్వరా ! ఇదిగో ! నా భార్య, పిల్లలకు, బ్రతకటానికి ఏదో ఒక దారి చూపించు. అంతే. ఈ రోజే, వెళ్ళిపోయి, ఏ కొండల్లోనో, గుహల్లోనో నిద్రపోతాను. వాగుల్లోని నీళ్ళు త్రాగుతాను. కనిపించిన కాయో, పండో తింటాను. లేకపోతే ఆకులలములు మేస్తాను. నీ మీద శ్రద్ధాభక్తులు, నువ్వు తప్ప నా కింకేమీ అక్కరలేదు. "
పుట్టినందుకు, వివాహం చేసుకొని సంతానం పొందినందుకు, వారిని పోషించటం తన విధి. భగవంతుడు వారి కేదో ఒక దారి చూపిస్తే, భగవత్సేవకు అంకితమౌతానని కవి విన్నవించుకుంటున్నాడు.
No comments:
Post a Comment