నీవా నన్నెద నమ్మి కష్టముల నెన్నేఁ బొందె ' దం చోర్పుగా
నేవో చెప్పెద వంచు నా మనసులో నేమేమొ యూహించి నీ
పై విశ్వాసము నుంచితిన్ వదల కప్పా ! నన్ను విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై రెండో పద్యం.
" విశ్వేశ్వరా ! తండ్రీ ! నువ్వొస్తావని, వచ్చి, " ఓహో ! నువ్వా ? నన్ను హృదయంలో నమ్ముకొని, ఎన్నెన్నో కష్టాలనుభవిస్తున్నావు కదా ! " అంటూ ఓర్పుగా యేవేవో ఓదార్పు మాటలు మాట్లాడతావని, నా మనసులో యేవేవో ఊహించుకొని, నీ పైన అంతులేని విశ్వాసముంచానయ్యా ! నన్ను మాత్రం వదిలిపెట్టొద్దు తండ్రీ ! "
విశ్వనాథ, " భవానీభర్గులే తల్లీ దండ్రి యటంచు " ప్రగాఢంగా నమ్మినవాడు. అందుచేత, ఎటువంటి పరిస్థితులలోను, తన చేయిని వదలవద్దంటున్నాడు. పరిపూర్ణమైన భక్తివిశ్వాసాలతో భగవంతుని నమ్మినవారిని, ఆయన ఎన్నటికీ వదలడు కదా !
No comments:
Post a Comment