ళావేశంబున శత్రుమూర్థముల యందాఘాతముల్ సేయఁ గ్రో
ధావిష్టుల్ తమ రక్తమే యితర రక్తంబంచు దైత్యాధముల్
త్రావన్ జూతురు రాక్షసప్రకృతి యౌరా ! వింత ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఇరవయ్యో పద్యం.
" విశ్వేశ్వరా ! నీవు ఆదిత్యగణాన్ని వెంటబెట్టుకొని వెళ్ళి, దుష్టులను సంహరించాలనే ఆవేశంతో వాళ్ళ తలల మీద పిడిగ్రుద్దులు గుద్దగా, కోపంతో ఒళ్ళు తెలియని ఆ దైత్యాధములు, వారి తలల మీద నుండి కారుతున్న రక్తమే ఇతరుల రక్తమనుకొని త్రాగటానికి చూస్తున్నారు. తండ్రీ ! ఏమిటీ రాక్షస స్వభావం? వింత కదా ! "
సనాతనధర్మం, మూడు రకాలైన దేవతల సమూహాన్ని గురించి చెబుతుంది.
వారు అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు. ఆదిత్యగణం, విష్ణువు ప్రథాన రక్షకుడుగా, దుష్ట సంహారం, శిష్టరక్షణ కార్యాలను నిర్వహిస్తుంది.
ఈ పద్యం కూడా శివకేశవుల అభేదాన్ని సూచిస్తూ, భగవంతుని యొక్క దుష్ట సంహార కార్యాన్ని తెలియజేస్తున్నది.
No comments:
Post a Comment