దీనిన్ వీఁడఁగనెంచు నా నిముసమందే భార్యగా సంతతిం
గా నా కాళ్ళను బందముంచితివి పోఁగా నెంతుఁ బోనైనచోఁ
బ్రాణాల్ పోవును వీరి కీ మమతఁ గోయన్ జాల విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని అరవైయేడో పద్యం.
" విశ్వేశ్వరా ! నేను లోకంలో జరిగే దుర్మార్గాన్ని చూసి, చాలా విరక్తితో, ఈ సంసారబంధాల నుంచి తప్పించుకు పోవాలనుకొన్నాను. కానీ, అటువంటి సమయంలో, నా భార్య, పిల్లలను బంధాలుగా నా కాళ్ళను కట్టివేశావు. ఎన్నోసార్లు నేను ఈ సంసారం నుంచి పారిపోవాలనుకొన్నాను. కానీ, నేను వెళ్ళిపోతే, నాపై ఆధారపడిన నా భార్య, పిల్లల, ప్రాణాలు పోతాయి.. నా వారిపై మమకారాన్ని త్రెంచుకోలేకుండా ఉన్నాను తండ్రీ ! "
ఆత్మాశ్రయ కవిత్వ ధోరణిలో, లోకంలో జరిగే దుర్మార్గం దుర్భరంగా ఉందనీ, అందువల్ల లోకవ్యవహారాల నుండి, సంసారబంధాల నుండి తప్పుకోవాలని అనుకొన్నాననీ, విశ్వనాథ లోకం తీరును వివరించారు.
No comments:
Post a Comment