రువ్యాబద్ధ పవిత్ర దైవతధునీ ! రుద్రాభిషేకం బొగిన్
నవ్యశ్రీగతిఁ జేయఁగా నమకమైనన్ రాదుగా హూణ వా
క్కావ్యామోదము ముక్తిత్రోవెదురుచుక్కై పోయె విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి ' శతకం లోని పదునాల్గవ పద్యం.
పరమేశ్వరుడు తత్త్వంలో, జ్యోతిస్వరూపం, జ్ఞానస్వరూపం, ఆనందస్వరూపం. అటువంటి జ్యోతిర్మయునికి పొంగుకొస్తున్న భక్తిభావంతో, నూత్నంగా తనదైన రీతిలో, రుద్రాభిషేకం చేద్దామంటే నమకమైనా తనకు రాదంటున్నారు విశ్వనాథ. దానికి కారణం కూడా చెబుతున్నారు వారు. మ్లేచ్ఛజాతుల వారిచే రచింపబడిన కావ్యాలకు మొగ్గు చూపుతుండటం వలన, ముక్తిమార్గాన్ని చూపే వేదవిద్యలు అధ్యయనం చేయటం లేదని వాపోతున్నారు విశ్వనాథ.
" నమకమైనన్ రాదుగా " అనటంలో ఒక విశేషం ఉంది. పరమేశ్వరుడికి అభిషేకం మహన్యాసపూర్వక నమక చమక పాఠాలతో చేస్తారు. అందులో నమకం ప్రధానమైనది. అదే రానప్పుడు, ఇక సంపూర్ణ వేదాధ్యయనం సంగతి చెప్పేదేముంది?
నమకం ఋగ్వేదంలోని భాగం. పరమేశ్వరుడు వేదస్వరూపుడు. నమక చమకాలతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పాశ్చాత్యవిద్య, పాశ్చాత్యభాషాభిమానం యెక్కువై పోవటం వల్ల, ముక్తిమార్గాన్ని చూపే వేదాధ్యయనానికి గండి కొట్టినట్లయిందని విశ్వనాథ ఆవేదన.
ఇక శివుని పరంగా వాడిన విశేషణం " జాటజూటాగ్రచారువ్యాబద్ధపవిత్రదైవతధునీ ! " విషయానికొస్తే, " జటావనుల్లో అడ్డుకట్టవేయబడిన పవిత్రమైన స్వర్లోకగంగ కలవాడా ! " అని అర్థం.
No comments:
Post a Comment