నీకేమో మఱి నేను బూదితనువున్ నిండారఁగా బూసి భి
క్షాకుక్షింభరవృత్తి బుత్తుననుచున్ గాలంబు భిన్నాధ్వముల్
గా కేదోయొక మధ్యత్రోవఁజన నేలా రావు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని అరవయ్యొకటో పద్యం.
" విశ్వేశ్వరా ! నువ్వూ నేనూ ఏదో ఒక మధ్యే మార్గానికి వద్దామయ్యా ! నాకేమో నువ్వు రత్నాలు, అష్టైశ్వర్యాలు ఇస్తావని ఆశ పెట్టుకొన్నాను. మరి నీకేమో నేను ఒంటి నిండా విభూతి పూసుకొని పొట్ట నింపుకోవటానికి బిచ్చ మెత్తుకోవటం ఇష్టం. ఈ రకంగా వేరు వేరు త్రోవలుగా కాలం వెళ్ళబుచ్చకుండా, మనిద్దరం ఏదో ఒక రాజీకి రావచ్చు కదా స్వామీ !. "
విశ్వనాథ వ్యంగ్యమర్యాద ధోరణిలో, తన దారిద్ర్ర్యాన్ని పోగొట్టమని వేడుకొంటున్నారు. శివుడు అష్టైశ్వర్యప్రదాత. ఆయన భక్తుడు బిచ్చమెత్తుకోవటం మర్యాద కాదు. అందుచేత, ఏదో ఒక మధ్యేమార్గంలో వెళ్దామని కవిసమ్రాట్టులు చమత్కరిస్తున్నారు. ఒంటినిండా బూడిద పూసుకొని భిక్షాటన చేయటం శివునికి ప్రీతికరమే అయినా, భక్తుడు దారిద్ర్యబాధ ననుభవించటం శివునికి సమ్మతం కాదు, కాకూడదు. అందువల్ల, ఇద్దరూ ఏదో ఒక అంగీకారానికి రావటం తప్పనిసరి.
No comments:
Post a Comment