త్యంతంబున్ బయిఁ జల్లితిన్ మృదుల భావాఖ్యప్రసూనాళి
యంతర్గేహము బాగుజేసితిని నీకై కంటిదారిన్ బ్రతీ
క్షింతున్ వాసకసజ్జికన్ బలె నుమాచిత్తేశ ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై ఒకటో పద్యం.
" విశ్వేశ్వరా ! మనస్సు అనే మెత్తని పానుపు మీద భక్తి అనే పేరు గల వస్త్రాన్ని పరిచాను. దాని పైన, భావములు అనే మెత్తని పూలను చల్లాను. నా అంతరంగ మనే ఇంటిని చక్కగా శుభ్రపరిచాను. పార్వతీహృదయవల్లభా ! ఇక వాసకసజ్జిక వలె నీవు వచ్చే దారి వంక ఎదురుచూస్తుంటాను. "
అష్టవిధ నాయికలలో వాసకసజ్జిక ఒకరు. వాసకసజ్జిక అనగా, చక్కగా అలంకరించుకొని ప్రియుని కోసం ఎదురుచూసే నాయిక.
No comments:
Post a Comment