పాటింతున్ సకలాఘముల్ సురధునీ పాథస్తరంగాగ్ర భా
గాటచ్ఛీతలమందమారుతతరంగాధూతముల్ గాగ నై
శాటప్రాణ మరున్మహాభుజగవంశస్వామి ! విశ్వేశ్వరా !
' మా స్వామి ' శతకంలో ఇది పదిహేడవ పద్యం.
" విశ్వేశ్వరా ! నిన్ను సర్వదేవతల శిరస్సులపై నున్న రత్నంగా భావిస్తాను. నీవు, రాక్షసుల ప్రాణవాయువును హరించే మహాసర్పము వంటి వాడివి. అంతేకాదు, భుజగవంశస్వామివి. మహాసర్పాలు వాయుభక్షణ చేసినట్లు, రాక్షసాధముల ప్రాణాలను హరించే వాడివి. గంగానదీతరంగాల పైన మెల్లగా వీచే చల్లని గాలులు ఏ విధంగా ఆ తరంగాలను కదిలేటట్లుగా చేస్తాయో, అదేవిధంగా, నీ దయ కనుక ఉంటే, సకల పాపాలు చెల్లచెదరైపోతాయి. "
విశ్వనాథవారు వాడే విశేషణాలు ప్రత్యేకంగా ఉంటాయి. అదేవిధంగా, ఈ శతకంలోని పద్యాలలో వాడిన దీర్ఘసమాసాలు, వాటి అర్థాన్ని అన్వయించుకొనే వరకు ఊపిరాడనివ్వవు. ఒక్కసారి, కొద్దోగొప్పో అన్వయం కుదిరిన తరువాత, ఇక వాటిని వదలలేము. అదీ, విశ్వనాథ సత్యనారాయణగారి ప్రత్యేకత. విశ్వనాథవారి విశేషణాలు అంత విలక్షణమైనవి.
No comments:
Post a Comment