శ్రీకళ్యాణ మనోజ్ఞగీతములు తండ్రీ ! వాని నేఁ బాడుచో
నా కన్నుల్ బడివచ్చు బాష్పములు కంఠవ్యగ్రగాద్గద్యముల్
మై కేడించిన లేఁత చెమ్మటలు, రోమాంచాలు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై ఏడో పద్యం.
" విశ్వేశ్వరా ! హృదయనాడులతో కూడుకొన్న నా యీ శరీరమనే వీణ మీద కళ్యాణప్రదమైన మధురగీతాలు పలికించి, నీకు కానుక లిస్తాను తండ్రీ ! ఆ గీతాలను నే పాడుతూ ఉంటే, నా కళ్ళ వెంట అశ్రుధారలు కురుస్తాయి, గొంతు పూడుకుపోతుంది, చిరు చెమటలు పోస్తాయి, ఒళ్ళంతా గగుర్పొడుస్తుంది. "
భక్తుడు, భగవద్భావనలో మైమరచిపోయినపుడు, కంటి వెంట అప్రయత్నంగా నీళ్ళు కారటం, గొంతు పూడుకుపోవటం, గగుర్పాటు కలగటం సహజమైన మార్పులు.
No comments:
Post a Comment